పెళ్లి పీటలెక్కనున్న కీర్తి సురేష్?

మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు అంట. కీర్తి సురేష్ తన ఫ్రెండ్ తో పెళ్లికి ఓకే చెప్పిందని, గోవా బీచ్ లో పెళ్లి వేదికను ఫిక్స్ చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలవడుతున్నాయి. అయితే నిజానికి ఈ తరహా వార్తలు కీర్తి సురేష్ కి కొత్తేమీ కాదు గతంలో సంగీత దర్శకుడు అనిరుథ్ తో కీర్తి ప్రేమలో ఉందని, త్వరలో వారిద్దరు ఒక్కటవబోతున్నారు అంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత దుబాయ్ కి చెందిన వ్యాపారితో కీర్తి సురేష్ పెళ్లి ఖాయమైంది అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే వాటన్నిటినీ కీర్తి సురేష్ సున్నితంగా ఖండించింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలపై కీర్తి సురేష్, ఆమె కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.