ఏపీలో అఘోరి హల్ చల్

మెగా9 , వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో అఘోరి హల్ చల్ చేసింది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఉన్న అఘోరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. సోమవారం తన కారును వాష్ చేస్తుండగా జర్నలిస్ట్ ఆమెను వీడియో తీశాడన్న నేపంతో జర్నలిస్టుపై అగోరి దాడి చేసింది. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని అగోరి హల్ చల్ చేసింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని జాతీయ రహదారిపై బైటాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అక్కడ నుంచి తరలించే యత్నం చేశారు. వెహికల్ ఎక్కాల్సిందిగా మహిళ అఘోరిని పోలీసులు లేపగా.. పోలీసులపై అఘోరి తిరగబడింది. తాను రానంటే రానని పోలీసులపై అఘోరి దాడి చేసింది. ప్రస్తుతం అఘోరి పోలీసులు, జర్నలిస్టుపై దాడిచేసి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.