ప్రీ సేల్ బుకింగ్స్ లో పుష్పరాజ్ హవా

మెగా9 వెబ్ డెస్క్ : తగ్గేదేలే అంటూ పుష్ప రాజ్ దూసుకుపోతున్నాడు. విడుదలకు ముందే పుష్పరాజ్ తన అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచి రోజుకొక రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్ లో పుష్ప – 2 మరో ఘనత సాధించింది. ఓవర్సీస్ లో అత్యధిక వేగంగా పుష్ప 2 వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి చేరింది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబ్ అవుతున్న ఈ చిత్రం
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఓవర్సీస్ లో ఒక్కరోజు ముందుగా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఓవర్సీస్ లో ప్రీ సేల్ బుకింగ్ లో మిలియన్ డాలర్స్ మార్కును చేరుకుంది.

అమెరికన్ బాక్స్ ఆఫీస్ అత్యధిక వేగంగా టికెట్లు ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్కును చేరిన సినిమాగా ‘పుష్ప- 2’ నిలిచింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుంది అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని అవార్డ్స్ పుష్పరాజ్ సొంతం అంటూ బన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.