మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఆంథోనీ జాషువా (Anthony Joshua) ప్రయాణిస్తున్న కారు నైజీరియాలో ఘోర ప్రమాదానికి గురైంది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఒగున్ స్టేట్‌లోని ‘లాగోస్-ఇబాడాన్’ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘటన జరిగింది.అతివేగంగా వెళ్తున్న ఆయన లెక్సస్ (Lexus) కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాషువా జట్టులోని కీలక సభ్యులు, ఆయన అత్యంత సన్నిహితులు సినా ఘామీ (Sina Ghami), లతీఫ్ అయోడెల్ (Latif Ayodele) అక్కడికక్కడే మరణించారు. సినా ఘామీ ఆయనకు స్ట్రెంత్ కోచ్‌గా, లతీఫ్ పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు.అదృష్టవశాత్తూ కారు వెనుక సీట్లో ఉన్న ఆంథోనీ జాషువా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.తన ప్రాణ స్నేహితులను కోల్పోవడంతో జాషువా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇటీవలే బాక్సింగ్ రింగ్‌లో జేక్ పాల్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న జాషువాకు, ఈ ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది.