ఇది మన ప్రాంత కళకు, మహిళా శక్తికి లభించిన గొప్ప గుర్తింపు:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

Spread the love

తాజాగా తన ‘మన్ కీ బాత్’  కార్యక్రమం డిసెంబర్ 28, 2025 – 129వ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నర్సాపురం “క్రోచెట్ లేస్” (Crochet Lace) కళ గురించి ప్రధాని నరేంద్రమోడీ ఎంతో గొప్పగా ప్రస్తావించారు. కాగా, నరసాపురం “క్రోచెట్ లేస్” కళను తాజాగా జరిగిన  “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నరసాపురం మహిళల కష్టపడి సృష్టించిన డిజైన్లు నేడు విదేశాలకు ఎగుమతి అవుతూ, భారతీయ హస్తకళల సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయి. ఇది మన ప్రాంత కళకు, మహిళా శక్తికి లభించిన గొప్ప గుర్తింపు అని కొనియాడారు. 

ప్రధాని మోదీ నర్సాపురం లేస్ క్రాఫ్ట్‌ను మహిళా సాధికారత మరియు ఆర్థిక ప్రగతికి ఒక గొప్ప ఉదాహరణగా అభివర్ణించారు. తరతరాలుగా మహిళలు తమ ఓర్పుతో, అంకితభావంతో ఈ అరుదైన కళను కాపాడుకుంటూ వస్తున్నారని ఆయన కొనియాడారు. నర్సాపురం లేస్ ఉత్పత్తులకు ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం 250 గ్రామాల్లో దాదాపు లక్ష మంది మహిళలు ఈ వృత్తి ద్వారా ఉపాధి పొందుతున్నారని, ఇది “లోకల్ ఫర్ వోకల్” నినాదానికి నిదర్శనమని  పేర్కొన్నారు.