ప్రముఖ మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్గజం మోహన్ లాల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. తన ఎదుగుదలలో తల్లి పాత్ర ఎంతో ఉందని, ఆమె ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మోహన్ లాల్ పలు సందర్భాల్లో ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నప్పుడు ఆ సంతోషాన్ని మొదట తల్లితోనే పంచుకునేవారు. శాంతకుమారి మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.