చిరంజీవి రామ్ చరణ్‌కు తమ్ముడిలా ఉన్నాడు అంటున్నారు :-  దర్శకుడు అనిల్ రావిపూడి

Spread the love

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి సందడిని అప్పుడే మొదలుపెట్టింది.ఈరోజు  గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈ చిత్రంలోని మూడవ పాట ‘మెగా విక్టరీ మాస్’ లాంచ్ ఈవెంట్ జరగనుంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాలో చిరంజీవి లుక్ చూసిన వారంతా ఆయన తనయుడు రామ్ చరణ్‌కు తమ్ముడా? అని అడుగుతున్నారని, బాస్ అంత యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని అనిల్ పేర్కొన్నారు.ఈ సినిమాలో కొత్తగా కనిపించడం కోసం చిరంజీవి పడిన శ్రమ తెరపై అందరికీ కనిపిస్తుంది. 

కాగా సెట్లో అందరూ ఆయన యూత్ ఫుల్  ఉన్నారని చెబుతుండేవారు.అందుకే రోజూ దిష్టి తీయించుకోండి అని చిరంజీవికి చెప్పాను.ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్‌ను అభిమానులు మళ్లీ ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఈ పాటలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసే సందడి థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని చెప్పారు.ప్రభాస్ ‘రాజా సాబ్’ జనవరి 9న పండగను ప్రారంభిస్తే, తాము జనవరి 12న దానిని కొనసాగిస్తామని ప్రకటించారు.ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.