ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 నియామక ప్రక్రియలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులకు తెరపడింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది.మహిళలు,దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న పిటిషనర్ల వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసుకుని ఫలితాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఈ తీర్పు భారీ ఊరటనిచ్చింది.కోర్టు ఆటంకాలు తొలగిపోవడంతో, ఏపీపీఎస్సీ (APPSC) ఇకపై నియామక ప్రక్రియను వేగవంతం చేసి,తుది ఎంపిక జాబితాను విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది.దాదాపు 900 పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ప్రక్రియ త్వరలోనే కొలిక్కి రానుంది.