మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుండి మోస్ట్ అవైటెడ్ ‘మెగా విక్టరీ మాస్’ (Mega Victory Mass) లిరికల్ వీడియో విడుదలైంది.ఈ పాటలో చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ స్టెప్పులేయడం అభిమానులకు అసలైన సంక్రాంతి విందులా మారింది.అయితే సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన అదిరిపోయే మాస్ బీట్‌కు, కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ తోడవ్వడంతో ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ముఖ్యంగా పాట మధ్యలో వెంకీ గురించి చిరు, బాస్ గురించి వెంకీ అడిగే లైన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన కామెడీ మార్క్ పాటుగా , మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్ & గోల్డ్ బాక్స్ ఎంట్రిన్మెంట్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.తాజాగా విడుదలైన ఈ మాస్ సాంగ్‌తో మెగా-విక్టరీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.