భారత్ కు  క్షమాపణలు చెప్పిన లలిత్ మోదీ

Spread the love

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారైన సంగతి తెలిసిందే.  బ్రిటన్ పరారైన అతను ఇటీవల తాను చేసిన ఒక పనికి భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. అతని లాగే పరారీలో ఉన్న మరో వ్యక్తి విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు  సందర్భంగా అతనితో  కలిసి పార్టీ చేసుకున్న లలిత్ మోదీ Biggest fugitives” అంటే అతిపెద్ద పరారీలో ఉన్న నేరస్తులు అనే అర్ధం. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేసిన విషయం విదితమే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇద్దరు మోసంచేసి, పారిపోవడమే కాకుండా విదేశాల్లో భారత్ ను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై లలిత్ మోదీ స్పందిస్తూ.. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ కామెంట్స్  చేయలేదన్నారు. తన కామెంట్స్  తప్పుగా అర్థం చేసుకున్నారని తనకు భారత ప్రభుత్వం అంటే చాలా గౌరవం ఉందని పేర్కొన్నారు. మరోవైపు లలిత్ మోదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దేశం నుంచి పారిపోయిన ఇద్దరు నిందితులను భారత్ కు  తిరిగి తీసుకురావడానికి బ్రిటన్ ప్రభుత్వంతో డిప్లామేటిక్  చర్చలు జరుపుతున్నామని తెలిపింది.