ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ‘ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమాన్ని డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో చేపట్టాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు,సంక్షేమ పథకాల అమలును వివరించాలన్నారు. ‘ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అగమ్యగోచరంగా మారిందని, చంద్రబాబు సారథ్యంలోదార్శనిక పాలన మొదలైందని పేర్కొన్నారు.