‘ఆత్మనిర్భర్’ రక్షణ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకం

Spread the love

రాయలసీమ ఆవిష్కరణలు, అధునాతన తయారీ రంగం, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు మరియు జాతీయ స్థాయిలో హబ్ గా  మారడానికి సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.  ఆంధ్రప్రదేశ్ నుండి భవిష్యత్తు సరికొత్త ఎత్తులకు ఎగరబోతోందన్నారు. రాయలసీమకు ఇది ఒక చారిత్రాత్మక రోజు అని  అలాగే ఆంధ్రప్రదేశ్‌కు గర్వించదగ్గ మైలురాయన్నారు.  AMCA 5వ తరం స్టెల్త్ ఫైటర్ ప్రోగ్రామ్ నుండి రక్షణ రంగ తయారీ, క్షిపణులు, డ్రోన్లు, ఏరోస్పేస్ సిస్టమ్స్ మరియు అధునాతన సాంకేతికతలలో భారీ పెట్టుబడుల వరకు – ఈ రోజు మన రాష్ట్రంలో ఒక కొత్త శకానికి ఆరంభమని లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ తో కూడిన నాయకత్వంలో,రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్  మద్దతుతో, భారతదేశపు ‘ఆత్మనిర్భర్’ రక్షణ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైన స్థాయిలో ఎదుగుతోందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *