ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ (ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) జరగనుంది. ఈ మేరకు ఎలెక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5 నుండి ఈ ప్రాసెస్ మొదలవనుంది. మొదట 10 రోజుల పాటు ‘sir’ మేనేజ్ కు ప్రిపరేషన్, బూత్ లెవెల్ ఆఫీసర్లకు ట్రైనింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. పొలిటికల్ పార్టీలు పెట్టుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు వారికి సహకరిస్తారు.
ఇక అదే టైమ్ లో పోలింగ్ సెంటర్ల రేషనలైజేషన్ పూర్తిచేస్తారు. జులై 21న ముసాయిదా ఓటర్ల లిస్ట్ విడుదల చేస్తారు. అనంతరం నెల రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు తీసుకుంటారు. అర్హత లేని వారికి నోటీసులు జారీచేసి రెండు నెలల్లో వాటిని పరిష్కరిస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక సెప్టెంబరు 22న ఫైనల్ ఓటర్ లిస్టు ప్రచురించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఓటర్లు 4,16,16,061 ఉన్నారు. మొత్తం బూత్ లెవెల్ ఆఫీసర్లు 46,397. బూత్ లెవెల్ ఏజెంట్లు 68,868 మంది ఉన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం మరియు చనిపోయిన లేదా వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్లను తొలగించడం ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం.