దేవదాసు సినిమాతో తెరంగ్రేటం చేసి యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుని రెండు దశాబ్దాలుగా యంగ్ ఎనర్జిటిక్ పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు రామ్ పోతినేని. రెడీ, కందిరీగ, మస్కా, రామ రామ కృష్ణ కృష్ణ, ఎందుకంటే ప్రేమంట, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్ తదితర విజయవంతమైన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చేశారు. ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేయనుండడం విశేషం. రచయిత కూడా ఆయనే కావడం గమనార్హం. RAPO 23 అనే వర్కింగ్ టైటిల్ తో రామ్ 23వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. the story of a Lone Wolf అనే ట్యాగ్ లైన్ ను జోడించారు. ఇక ఈ సినిమాకు కృష్ణ పోతినేని నిర్మాత. రాపో సినిమాటిక్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ఇందులో వీర అనే పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఇక కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. డిసెంబర్ 2026లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు తన నటన, టాలెంట్ తో ఆకట్టుకున్న రామ్ ఇప్పుడు దర్శకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కూడా కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.