నాకు అండగా నిలబడి మాట్లాడిన అందరికి ధన్యవాదాలు:వైసీపీ నేత అంబటి

Spread the love

మూడు కేసులకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజుల పాటు  రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా, ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దాడులు ఖండించిన వారికి  ధన్యవాదాలు తెలిపారు. 

అంబటి కామెంట్స్:ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకున్నారని అన్నారు. 31 వ తేదీ అర్థ రాత్రి నల్లపాడు పొలీసులు నన్ను అరెస్ట్ చేశారు..కోర్టు ఆదేశాలతో 18 వ తేదీ జైలు నుండి విడుదల అయ్యాను..ఏ పార్టీలో ఉన్న ప్రజా సౌమ్యవాదులు అన్నీ గమనిస్తారు..తిరుమల లడ్డు ప్రసాదంలో విషయంలో పశువుల కొవ్వు కలవలేదని సిట్ విచారణ చేపట్టి రిపోర్ట్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా అబద్ధాలతో ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు.

అసత్యాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలి డిమాండ్ చేశాను.మరుసటి రోజు పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పేరుతో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. దేవస్థానం నుండి నేను తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా టిడిపి నాయకులు, కార్యకర్తలు నాపై పచ్చి బూతులు తిడుతూ నా కారుపై దాడి చేశారు. నాపై నా కారుపై దాడి జరిగే క్రమంలో నేను నోరుజారి తిట్టాను.నేను మాట్లాడిన మాటలకు కొంత సమయానికి క్షమాపణ కూడా చెప్పాను..

నేను క్షమాపణ చెప్పిన నాపై దాడికి వచ్చారు.నా ఇంటిని, కార్యాలయాన్ని నా కార్లను ధ్వంసం చేశారు.నేను కమ్మ కులాన్ని ఎక్కడ దూషించలేదు.పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన చెప్పిన విధంగా 24 గంటల్లో పెద్ద సినిమా చూపించారు. నాపై దాడిని ప్రాతినిధ్యం చంద్రబాబు, నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్  మానిటర్ చేశారు.18 రోజులు జైలులో పెడితే రాంబాబు అనే నేను భయపడతానా.అక్రమ కేసులకు జైలులో పెడితే భయపడతానా. బీజేపీ, సిపిఐ, జడ శ్రవణ్ కుమార్, జనసేన న్యాయవాది రజిని నాపై దాడిని ఖండించారు.నాకు అండగా నిలబడి మాట్లాడిన అందరికి నా ధన్యవాదాలు..దాడులు ఎవరు చేసిన ఖండించాలి..దాడులు ఎవరు చేసిన తప్పే..నాకు 18 రోజుల జైలు జీవితం నాకు నా కాలేజీ రోజులను గుర్తు చేశాయి..జగన్ మోహన్ రెడ్డి బిరుదు ఇచ్చిన విధంగా కాపు టైగర్ మరిదిగానే బ్రతుకుతా.. స్టార్ హోటల్లో ఉన్న, జైల్లో నేలమీద పడుకున్న..

సాధారణ స్థాయి నుండి ఇంత స్థాయికి వచ్చాను.. నేను లేని రోజు నా కూతురు బయటకు వస్తుంది..

నేను లేని లోటును నా కూతుర్లకు తీర్చారు..నా దృష్టిలో కొడుకులు అయినా కూతుర్లు అయినా ఒక్కటే.. నాపై దాడి చేసే సమయంలో నాకు అండగా పార్టీ నగర అధ్యక్షురాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు..అన్నిటికీ ఐ డోంట్ కేర్..బుర్రలేక బురద చల్లే మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *