బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి

Spread the love

నేడు సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు  దొమ్మేటి వెంకటరెడ్డి  జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు  ఘన నివాళి అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. యువగళం పాదయాత్రలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ పండుగగా చేయాలని ఆనాడు శెట్టిబలిజలు లోకేష్ ను  కోరారు. కాగా, కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించి, నాడు యువగళం పాదయాత్రలో శెట్టిబలిజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *