నేడు ఆంధ్రప్రదేశ్ SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25% గతేడాది 81.14% కంటే మెరుగుగా ఉండడం విశేషం. ఈసారి కూడా బాలికలదే పైచేయి. బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 82.68% సాధించారు.
ప్రభుత్వ పాఠశాలల పురోగతి కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత గతేడాది 72.8% ఉండగా.. 78.39% కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల కాలంలో భారీ పెట్టుబడులు మరియు విప్లవాత్మక ప్రాజెక్టుల ద్వారా వార్తల్లో నిలవడం గర్వకారణంగా ఉందని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అయితే, విద్యాశాఖ మంత్రిగా SSC ఫలితాల్లో కనిపిస్తున్న స్థిరమైన పురోగతి అంతకంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తోందన్నారు. ఫలితాలు సంబంధిత పాఠశాలల HM లాగిన్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. AP ఓపెన్ స్కూల్ (APOSS) SSC మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి 2026 ఫలితాలు కూడా విడుదలయ్యాయి.
APOSS ఫలితాల కోసం: https://apopenschool.ap.gov.in సందర్శించి లేదా మన మిత్ర (9552300009) లేదా డిజీలాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పురోగతి మన విద్యార్థుల పట్టుదలకు, ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యుల బలమైన మద్దతుకు నిదర్శనమని లోకేష్ తెలిపారు.
విజయం సాధించిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేని వారు దయచేసి నిరాశ చెందవద్దని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు సమాజం మద్దతుతో మరింత బలంగా తిరిగి వస్తాన్నారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక. ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూసేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని లోకేష్ పేర్కొన్నారు.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.
అధికారిక పోర్టల్: https://results.bse.ap.gov.in
మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్): 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి
LEAP మొబైల్ అప్లికేషన్
డిజీలాకర్ (DigiLocker).