ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో గుండెలవిసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ గడప ముందే రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిని హరి, చెన్నప్ప అనే అన్నదమ్ములు కొడవళ్లతో నరికి చంపారు.ఈ నెల 1వ తేదీన హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లడంతో, పోలీసులు వారిని గూడూరులో గుర్తించి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకువచ్చారు.నిందితులు కారు దిగి లోపలికి వెళ్తున్న సమయంలో మాటు వేసిన అన్నదమ్ములు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈశ్వరప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.స్టేషన్ ముందే ఈ రక్తపాతం జరగడం చూసి హరి భార్య భయంతో పరారు కాగా, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ సాక్షిగా పట్టపగలే ఈ హత్య జరగడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన పోలీసుల వైఫల్యమా లేక ప్రతీకార సెగలతో జరిగిన ముందస్తు ప్రణాళికా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.