శ్రీశైలంలో అపచారం….మల్లికార్జున సత్రంలో సినిమా పాటలకు డ్యాన్సులు..!

Spread the love

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆధ్యాత్మికతకు భంగం కలిగించేలా జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేవస్థానానికి చెందిన మల్లికార్జున సత్రంలో కొందరు సిబ్బంది సినిమా పాటలకు చిందులేస్తూ వేడుకలు జరుపుకున్నారు.పరమ పవిత్రమైన క్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా, భక్తులకు ఇబ్బంది కలిగించేలా సాగిన ఈ డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దేవాలయ ప్రాంగణంలో ఇటువంటి వినోద కార్యక్రమాలను ప్రోత్సహించడం సత్రం సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.ఈ ఘటనపై దేవస్థానం ఈవో ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు. పవిత్ర క్షేత్రాల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ ఉదంతం శ్రీశైలం దేవస్థాన పాలనాయంత్రాంగంపై విమర్శలకు దారితీసింది.