క్వాంటం టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుంది

Spread the love

క్వాంటం సాంకేతికత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం వ్యాలీ ప్రణాళికలు మరియు భారీ స్థాయి నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే బలమైన క్వాంటం వ్యవస్థను నిర్మించే దిశగా కీలక అడుగులు వేశామని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈరోజు దావోస్‌లో IBM చైర్మన్ మరియు CEO అయిన అరవింద్ కృష్ణతో సీఎం చంద్రబాబు  అత్యంత అద్భుతమైన సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని పది లక్షల మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇవ్వడం వంటి అంశాలపై ఈసమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని భారతదేశపు “క్వాంటం వ్యాలీ” గా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. 2026 నాటికి రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీలో ఆసియాలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.