రీసర్వే 2.0ను ప్రజా ప్రభుత్వమైన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హయంలో పూర్తి కచ్చితత్వంతో చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 3 దశల్లో 2,097 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. నాలుగో దశలో 1,613 గ్రామాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతుల పూర్తి భాగస్వామ్యంతో ఈ ప్రాసెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీసర్వే కాలాన్ని 90 నుంచి 143 రోజులకు పెంచామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే అంతా తప్పుల తడకలే అని విమర్శించారు. ప్రజల నుంచి గత ప్రభుత్వ రీసర్వేపై 7.5 లక్షల ఫిర్యాదులు అందాయని అన్నారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్లో రియల్ టైమ్ డేటా కనపడడం లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ క్యూఆర్ కోడ్లో రియల్ టైమ్ డేటాతో పాటు నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.