తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రధాన పార్టీల కూటములు సీట్ల పంపకాలు షురూ చేశాయి. మొత్తం 234 స్థానాలుండగా…అధికార డీఎంకే 164 సీట్లలో పోటీచేయనుంది. మిగిలిన 70 సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వనుంది. కాంగ్రెస్ కు 28 సీట్లు కేటాయించింది.డీఎండీకే కు 10 సీట్లు, లెఫ్ట్ పార్టీలకు చెరొక 5 సీట్ల చొప్పున, వీసీకే కు 8 సీట్లు, ఎండీఎంకే 4, ఎంఎంకే 2, ఐయూఎంఎల్ 2, ఎంజేకే, ఎస్.డీ..పీ.ఐ.కేకు చెరొక సీటు కేటాయించింది. ఇక ఈ సందర్భంగా డీఎంకే పోటీచేయనున్న మొదటి విడత అభ్యర్థుల జాబితాను సీఎం స్టాలిన్ విడుదల చేశారు. కొలాతూర్ నుండి సీఎం స్టాలిన్, చెపాక్ ట్రిప్లికేన్ నుండి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీచేయనున్నారు. మే 4న కౌంటింగ్ జరగనుంది. ఇక ఇప్పటికే మరో ప్రధాన కుటమైన ఎన్డీయే కూడా సీట్ల సర్దుబాటును పూర్తి చేసింది.