అజిత్ పవార్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ క్యాబినెట్

Spread the love

ఈరోజు మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం విదితమే. ఈ దుర్ఘటనపై సంతాపం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విచారం వ్యక్తం చేసింది. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు చనిపోవడంపై ఏపీ క్యాబినెట్ విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అజిత్ పవార్ తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.  ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి  లోనయ్యానన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్ లో తీర్మానం  చేశారు.