రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీ వేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు. ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించడమైనదని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. టి.శివశంకర్, శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విదారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుందని తెలిపింది. నివేదిక పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకూ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.