ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026 వేదికగా ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

Spread the love

రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్ ఏర్పాటుపై ఎంఓయూ జరిగింది. ఈ  ఒప్పందం కార్యక్రమంలో భారత్ జెన్ సీఈఓ హృషికేష్ మోహల్ బాల్, ప్రతినిధి రామకృష్ణన్ లు నెక్స్ జెన్ సీఈఓ రాజగోపాల్, ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ పాల్గోన్నారు. ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు  కాలిబో ఏఐ సంస్థ ఏపీతో ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేలా ఎంఓయూ కుదిరింది.ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై దృష్టి సారించేలా ఎంఓయూ.ఈ ఎంఓయూలో పాల్గొన్న రాజ్ వట్టికూటి, అరబిందో సాహూ, విపుల్ వలంజీ, పింటో జోయ్సన్, జోహన్నెస్ ష్రోడర్ తదితరులు ఉన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం వైజర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.  ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేసేలా వైజర్ సంస్థ ఒప్పందం. ఈ ఎంఓయూలో క్వాంటం సొల్యూషన్స్ హెడ్ వర్ధన్ సెహగల్, రాజ్ వట్టికూటి బృందం ఉంది. ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్ తో  రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ప్రొఫెసర్ మితేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *