టీ 20 వరల్డ్ కప్ లో సూపర్-8 చేరిన మొదటి జట్టుగా నిలిచిన వెస్టిండీస్ గ్రూప్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అదరగొట్టింది. నాలుగు మ్యాచ్ లలో గెలిచి 8 పాయింట్లతో గ్రూప్-సీలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 6పాయింట్లు, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ 2 పాయింట్ల చొప్పున సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇటలీని 42 పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ సత్తా చాటింది. మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ 75 (46; 6×4, 4×6) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇటలీ విండీస్ బౌలర్ల దెబ్బకు 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. బెన్ మానేంటి (26) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్ 4 వికెట్లు, మ్యాథ్యు ఫోర్డ్ 3 వికెట్లు, గుడకేశ్ మోతీ 2 వికెట్లు, అకీల్ హొసీన్ 1 వికెట్ పడగొట్టారు. షై హోప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.