ఆ రంగాలలో ఏపీ ఒక పవర్ హౌస్ గా ఎదుగుతోంది:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the love

రక్షణ, వైమానిక (ఏరోస్పేస్) మరియు డీప్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఒక పవర్‌హౌస్‌గా ఎదుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రూ.15,800 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ఏర్పాటుతో పాటు, ప్రధాన రక్షణ మరియు డ్రోన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్టుల స్థాపన, ఇన్నోవేషన్ బేస్డ్ డెవలప్మెంట్  మరియు వ్యూహాత్మక స్వావలంబన దిశగా ఒక చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు.  ఇది భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, రాష్ట్రంలో పారిశ్రామిక మరియు సాంకేతిక పురోగతిని వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చొరవ భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుందని  మన యువతకు ఉన్నత స్థాయి అవకాశాలతో సాధికారత చేకూరుస్తుందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ మరియు ఇన్నోవేషన్స్ లో ఆంధ్రప్రదేశ్‌ ను ముందంజలో నిలుపుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మరియు పరివర్తనాత్మక జాతీయ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ప్రధాని మోడీకి పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రను బలోపేతం చేయడానికి నిరంతరం మద్దతు అందిస్తున్న రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి, ఆవిష్కరణలు మరియు భవిష్యత్తుకు అనుగుణమైన పెట్టుబడుల కోసం తన దార్శనికతను మరింత బలోపేతం చేసుకుంటోందన్నారు.  ఈ కీలక చర్యలు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని  మన యువతకు మంచి అవకాశాలను సృష్టిస్తాయని అలాగే మన దేశ వ్యూహాత్మక మరియు సాంకేతిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *