APSRTCకి  ప్రతిష్టాత్మకమైన ‘ఈ-గవర్నెన్స్ PSU అవార్డు’

Spread the love

APSRTC ప్రతిష్టాత్మకమైన ‘ఈ-గవర్నెన్స్ PSU అవార్డు’ (e-Governance PSU Award) ను అందుకుంది. APSRTC సిబ్బంది యొక్క అంకితభావం, టీమ్‌వర్క్ మరియు దార్శనికతకు ఇది నిదర్శనమని సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. గవర్నెన్స్ నౌ-ఆరో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డుకు ఎంపికైన ఆర్టీసీ. 2025 ఏడాదికి ఈ అవార్డుకు ఎంపికైన ఏపీఎస్ఆర్టీసీ. ప్రధాన బస్టాప్ లలో బస్సుల రాకపోకలను ముందస్తుగా ప్రకటించినందుకు అవార్డు దక్కింది. ఆటోమేటిక్ అనౌన్స్మెంట్(ఏఏఎస్) అమలుకు ఆర్టీసీకి అవార్డు అందుకుంది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, సూపర్ వైజర్లు, సిబ్బందిని ఆర్టీసీ ఎండీ అభినందించారు. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా సంస్థలోని సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఈ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది ప్రయాణికులకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. డిజిటల్ టెక్నాలజీని ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు.