
Haryana Government Key Decision: మత మార్పిడులకు సంబంధించి దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహాలు చేసుకునేవారు.. తమ మతాన్ని దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే కఠిన శిక్షలు విధించాలని నిర్ణయించింది. ఇంతకు ఆ సర్కార్ ఎవరు…ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు… ఆ శిక్షలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు వారి మతం ఏంటని విషయం చెప్పకుండా దాచి ఇతరులను మోసం చేసి పెళ్లి చేసుకుంటారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వారి మతం చెబుతున్నారు. అప్పుడు వారు ఏం చేయలేని పరిస్థితి. ఇలా మోసం చేస్తూ మతాంతర వివాహాలు విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. దీనికోసం మతమార్పిళ్ల నిరోధక చట్టం 2022 ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ చట్టం ప్రకారం వివాహం కోసం జరిగే మతమార్పిడిని నిరోధిస్తారు. మతాన్ని దాచి పెట్టి వివాహం చేసుకుంటే.. అది చెల్లదని తెలిపింది. ఇలా ఎవరైతే మతం దాచి పెళ్లి చేసుకుంటారో వారికి జరిమానాతో పాటు పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది.
సాధారణ చట్టవిరుద్ధ మతమార్పిడి చేస్తే ఒకటి నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే ఒక లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అదే మతం దాచి కనుక పెళ్లి చేసుకుంటే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే మూడు లక్షల జరిమానా కూడా ఉంటుందని హర్యానా ప్రభుత్వం తేల్చి చెప్పింది. మైనర్, మహిళ లేదా sc,st,వారి మతం మార్చి పెళ్లి చేసుకుంటే 4 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉండటంతో పాటు కనీసం రూ.3 లక్షల జరిమానా ఉంటుంది. సామూహిక మతమార్పిడి అంటే ఒకేసారి ఇద్దరు కంటే ఎక్కువ మందిని ఇలా మోసం చేస్తే దాదాపుగా 5 నుంచి10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కనీసం రూ.4 లక్షల జరిమానా ఉంటుంది.. అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి జరిగిన వివాహం నుంచి జన్మించిన ఏ బిడ్డనైనా చట్టబద్ధంగా పరిగణిస్తారు. పిల్లల వారసత్వ హక్కులు తల్లిదండ్రుల సాధారణ వారసత్వ చట్టాలను అనుసరిస్తాయని పేర్కొంది. Haryana Government Key Decision.
ఎవరైనా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చట్టప్రకారం మతమార్పిడికి సంబంధిత వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకుని, నిర్ణీత గడుపు దాకా నిరీక్షించాల్సి ఉంటుంది. చట్టప్రకారం మత మార్పిడి జరిగితేనే తర్వాత పెళ్లి చేసుకోవచ్చు . అలా కాకుండా బలవంతంగా, మోసపూరితంగా జరిగే మతమార్పిడులు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించే ప్రసక్తే లేదని హర్యానా సర్కార్ తేల్చిచెప్పింది.
మతం మారాలనుకునే వ్యక్తి మతం మారడానికి ముందు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు ఫారమ్ A లో డిక్లరేషన్ దాఖలు చేయాలి. మతం మారే ముందు వ్యక్తి మైనర్ అయితే జీవించి ఉన్న తల్లిదండ్రులు ఇద్దరూ ఫారమ్ B ని సమర్పించాలి. ఏదైనా మత పూజారి లేదా మతమార్పిడి వేడుక నిర్వాహకుడు ఫారమ్ C లో మతం మారే జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు ముందస్తు నోటీసు ఇవ్వాలి. అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఈ డిక్లరేషన్లు, నోటీసులను అందుకున్నట్లు అంగీకరిస్తారు. ఇక వ్యక్తిగత మత స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని, మోసం, బలవంతం లేదా చట్టవిరుద్ధంగా ఎవరైనా ఇలా చేయకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకొచ్చినట్లు తెలిపింది. దీనివల్ల మతమార్పిడి చేయడానికి ప్రయత్నించరని క్లారిటీ ఇచ్చింది.
వ్యక్తుల యొక్క మత స్వేచ్చను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్న హర్యానా సర్కార్ ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమన్నారు.. ఇటీవల కాలంలో మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకొని ఆపై మతమార్పిడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో హర్యానా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు గుడ్ డిషీషన్ అంటున్నారు.