అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోవాలని హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) కి స్పైనల్ మస్క్యలర్ అట్రోఫీ టైప్ 2…బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా..ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి అవసరమైన జీవరక్షక ఔషధం AVXS-101 (Onasemnogene Abeparvovec). ఈ మందు భారతదేశంలో తయారు కావడం లేదు. ఇంజెక్షన్ ధర: రూ.16 కోట్లని తెలిపారు. ఇది ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన జీవరక్షక ఇంజెక్షన్ అని పేర్కొన్నారు. ఈ కుటుంబం హిందూపురం పర్యటనలో బాలకృష్ణను కలిసి తమ బిడ్డ పరిస్థితిని తెలియజేసింది. ఈ నేపథ్యంలో తన వంతుగా నేను సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగా కూడా తన ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదని కావున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమవంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అకౌంట్ వివరాలు (Account-8265662545 Name – A S Nataraj IFSC-IDIB000J028 Branch – JP NAGAR) కూడా పేర్కొన్నారు.