నేటి ట్రేడింగ్ లో  లాభాల బాటలో దూసుకెళ్లిన సూచీలు

Spread the love

నిన్నటి ట్రేడింగ్ లో నష్టాల నుండి కోలుకుని దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ సుమారు 918 పాయింట్లు లాభపడి 77,550 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 275 పాయింట్ల లాభంతో 24,050 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.92.89గా కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరుతో సూచీలు లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్ సహా పలు కీలక రంగాల షేర్లు  మార్కెట్‌ను నడిపించాయి.ఇజ్రాయెల్-లెబనాన్, ఇరాన్ ఉద్రిక్తతలు సమసిపోతాయాయనే  ఆశలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, రిలయన్స్ తదితర షేర్లు లాభాల్లో ముగిశాయి. పలు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో పయనించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *