టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్:ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో అద్భుత ఫలితాలు సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ఏపీ సీఎం  చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఇండస్ట్రీస్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపీబీ సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎంకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చేయగలిగామని సీఎంతో చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతేడాది రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు.  భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పొర్టల్ ఆవిష్కరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చినట్లు పేర్కొన్నారు. 

14వ SIPB సమావేశం – ఆమోదించిన పెట్టుబడుల వివరాలు

సంస్థ పేరుజిల్లా/ప్రాంతంపెట్టుబడి (రూ. కోట్లలో)ఉద్యోగాల సంఖ్య
టాటా పవర్నెల్లూరు6,6751,000
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కడప5,5715,000
వెబ్ సోల్ రెన్యూవబుల్నాయుడుపేట3,5381,980
రామ్ కో సిమెంట్స్నంద్యాల1,500300
ఎథిరియల్ ఎక్స్ ప్లోరేషన్ గిల్డ్తిరుపతి578382
ఇస్కాన్సత్యసాయి425.201,035
రాధికా వెజిటబుల్స్ ఆయిల్స్విజయనగరం234165
సంఘం మిల్క్ ప్రొడ్యూసర్స్అనంతపురం200.82245
ఆర్ణ కోస్టల్ రిసార్ట్స్బాపట్ల187.58250
సైవెన్, యూనిఫై కన్సార్షియంబాపట్ల183.87196
పయనీర్ క్లీన్ యాంప్స్చిత్తూరు159600
శుభం, ఇంద్రనీర్ కన్సార్షియంబాపట్ల64.44100
నవ ఫుడ్ సెంటర్తిరుపతి44.42500
రిలయెన్స్ కన్స్యూమర్స్అనకాపల్లి30
మొత్తం19,391.3311,753