అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం.. వైసీపీపై ఫైర్  

Spread the love

తిరుమల లడ్డూ వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) జరిగిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు.నేను ఎప్పుడూ వేంకటేశ్వరస్వామిని మా ఇంటి దైవంగా చూస్తాను. ఏ కష్టం, బాధ వచ్చినా ఆయనను తలుచుకుని ముందుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అదే నా శక్తి.ప్రతిపక్షంలో ఉన్నా… అధికారంలో ఉన్నా క్యూలో వెళ్లి దర్శించుకున్నాను. ఆయన సేవలో ఉంటే రాష్ట్రానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి సరఫరా చేశారు.ఇందుకు రూ. 234 కోట్ల ఖర్చు చేశారు. ల్యాబ్‌లను కన్నుగప్పి టెండర్లు దక్కించుకున్నారు.20.01 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసి విక్రయించారు. ఎన్‌డీడీబీ రిపోర్టు గురించి ఆ భగవంతుడే నాతో చెప్పించాడు.లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టునే నేను చెప్పాను. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని నేను సొంతంగా  చెప్పలేదు. 2005 నుంచే అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి హయాంలోనే హిందువులపై దాడి మొదలైంది. ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేస్తూ అప్పటి పంచాయతీ రాజ్ కార్యదర్శి శామ్యూల్ ఉత్తర్వులు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్లు కూడా తలపెట్టని దురాలోచనలను వీరు చేశారు. అలాంటి ఏడు కొండలను రెండు కొండలుగా చేస్తారా? ఈ నిర్ణయంపై రెండేళ్ల పాటు దేశంలోని హిందువులంతా భగ్గుమన్నారు. ఈ అంశంపై నేను పోరాటం చేస్తే, తిరిగి నాపైనే ఆరోపణలు చేశారు. ఫేక్ ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యి కుట్రను జగన్ ఎంత ప్లాన్ ప్రకారం చేశాడో చూడండి అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించారు. సిట్ రిపోర్టులో కూడా NDDB ఇచ్చిన రిపోర్టును కోట్ చేస్తూ, నెయ్యిలో జంతు కొవ్వుతో కల్తీ చేసిన విషయాన్ని ప్రస్తావించారన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *