రాష్ట్రాభివృద్ధికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. నేడు ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేయడం వల్లే క్రైమ్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు. అందుకే దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వివరించారు. పోలీసులంటే భయం కాదు, భరోసా కల్పించే వ్యవస్థగా మారిందన్నారు. ఈ ఏడాదిలో క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని తెలిపారు. మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని పేర్కొన్నారు. 2014లో సీఎం చంద్రబాబు హయాంలో 14 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ హయాంలో వాటిని కూడా పట్టించుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు లక్షా 40 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.