నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ పురస్కారాలకు ఎంపికైన వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తన సోదరుడు అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమలో అన్నయ్య చిరంజీవిప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మరోవైపు పైడి జైరాజ్, బి ఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, టీఎల్ కాంతారావు, రఘుపతి వెంకయ్య, సి నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గార్ల పేరిట ఉన్న పురస్కారాలకు ఎంపికయిన కమల్ హాసన్, సింగీతం శ్రీనివాస రావు, అశ్వినీదత్, ఆర్ నారాయణమూర్తి, రమేష్ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, జయసుధ లకు అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాలకు ఎంపికైనవారు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు విలువైనవని కొనియాడారు. గద్దర్ పురస్కారాలకు ఎంపికైనవారికి అభినందనలు తెలిపారు.