గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలని గిరిజనాభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన కోసం  కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్ల  వసతి లేని  గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు.  డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం. విద్యుత్ వెలుగులు నింపుతున్నాము. పీఎం జన్మన్, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా నిధులు అందుబాటులోకి తెచ్చామన్నారు. . ఇప్పటికీ ఏదో ఒక మూలన గిరిజన గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్పందన కూడా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని ఏళ్ల తరబడి కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు.  ఆ ప్రాంత అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు నిబద్ధతతో వ్యవహరిస్తే అనేకం క్షేత్ర, డివిజన్, జిల్లా స్థాయిల్లోనే పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.  ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమీకృతం చేసుకుంటూ గిరిజనుల అభివృద్ధి పాటు పడాల్సిన ఐ.టి.డి.ఎ., జిల్లా యంత్రాంగం నిరంతర సమస్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.  సమస్య తీవ్రతను బట్టి ఏ స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్య ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలి. ప్రతి సమస్య ఉన్నత స్థాయి యంత్రాంగం దృష్టికి వెళ్తేనే పరిష్కారం అవుతుందన్న భావన ప్రజల్లో నుంచి పోగొట్టాలని పేర్కొన్నారు. . ఆ బాధ్యతను ఐ.టి.డి.ఎ., జిల్లా స్థాయి పాలనా యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని సూచించారు.