ఆసక్తికరంగా శోభిత ధూళిపాళ్ల  ‘చీకటిలో’ ట్రైలర్!

Spread the love

సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటించిన తెలుగు నటి  శోభిత ధూళిపాళ్లనాగ చైతన్య ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం  ఆమె నటించిన ‘చీకటిలో’ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆమె రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా   ట్రైలర్ రిలీజ్ అయ్యింది… ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కాబట్టి, హైప్ కొంచం ఎక్కువగానే ఉంది. అలాగే ట్రైలర్ లోకి వెళ్తే, ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల సంధ్య ఆత్మవిశ్వాసం గల యాంకర్ పాత్రలో కనిపించింది. న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న సంధ్య, కొంతకాలానికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, తన సొంత PODCAST ‘చీకటిలో’ ప్రారంభిస్తుంది. నిజాన్ని వెలికి తీసే జర్నలిజమే తన లక్ష్యంగా ముందుకెళ్లే సంధ్య జీవితం, ఆమె స్నేహితుల హత్యలతో ఒక్కసారిగా దారుణ మలుపు తిరుగుతుంది. తనకు అత్యంత దగ్గరైన స్నేహితులు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుండటంతో, వాటి వెనక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని సంధ్య స్వయంగా దర్యాప్తు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో బయటపడే నిజాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.ట్రైలర్ చివర్లో “సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా?” అనే ప్రశ్నతో ముగియడం, కథలోని మిస్టరీని మరింత లోతుగా చూపిస్తోంది. ఈ ప్రశ్నే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతూ, అసలు హంతకుడు ఎవరు? అతడి ఉద్దేశం ఏమిటి? అన్న సందేహాలను కలిగిస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో 23rd నుంచి స్ట్రీమింగ్ కానుంది.