ఏపీలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ల బదిలీ

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా  శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా మయూర్ అశోక్, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గా మల్లవరపు సూర్యతేజ నియమితులయ్యారు.  గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీనివాసులు మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా నియమితులయ్యారు. మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించింది. చిత్తూరుకు  జాయింట్ కలెక్టర్ గా ఆదర్శ్ రాజేంద్రన్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబిక, కడప జేసీగా నిధి మీనా, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ, పల్నాడు జేసీగా వి. సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.