ప్రతీ ఒక్కరూ మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ, తల్లి ఒడిలో నేర్చుకునే తొలినుడిని గౌరవిస్తూ, జీవితంలో ఎదిగేందుకు ఎన్ని భాషలు నేర్చుకున్నా మనవారితో మాట్లాడేప్పుడు తల్లి నేర్పిన భాషలో సంభాషిస్తూ, మాతృభాషను పరిరక్షించేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ అంత‌ర్జాతీయ మాతృభాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.మన మాతృభాష తెలుగును కాపాడుకుందాం.. మన సంస్కృతిని భావి తరాలకు అందిద్దామని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *