కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బందిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. జరిగిన బాణసంచా పేలుడు ఘటన దురదృష్టకరం. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీగారి తో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పేలుడులో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా మరియు ఇతర సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా ఎస్పీగారి ని ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.