భారీ మాస్‌ ఫీస్ట్‌గా మెగాస్టార్-బాబీ మూవీ 

Spread the love

దశాబ్దాలుగా తనదైన నటన, డ్యాన్స్, ఎనర్జీ, స్టైల్‌, ఫైట్స్ ఇలా అన్ని రకాలుగా అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అగ్రనటుడు మెగా స్టార్ చిరంజీవి.  తాజాగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఘన విజయంతో చిరంజీవి మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ విజయంతో మెగాస్టార్‌ మళ్లీ  అదే పూర్తి ఉత్సాహంతో తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. చిరంజీవి తన కొత్త సినిమాకు దర్శకుడిగా బాబీ కొల్లి అన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి స్టైల్‌, బాబీ తెరకెక్కించిన కమర్షియల్‌ టచ్‌ కలిసి ఆ సినిమాను ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. అందుకే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందనే వార్త వినగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే మనకున్న సమాచారం ప్రకారం, ఈ కొత్త సినిమా షూటింగ్‌ వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుందిని తెలుస్తోంది.  ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. కథకు తగిన లొకేషన్లు ఎంపిక చేయడం, సెట్లు సిద్ధం చేయడం, నటీనటుల ఎంపిక వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సినిమా ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ గురించి అధికారిక ప్రకటనలు ఇంకా పూర్తిగా వెలువడకపోయినా, ఇప్పటికే ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా టైటిల్‌, హీరోయిన్‌, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్‌ ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే తన వయస్సు పెరిగినా కూడా అదే ఎనర్జీతో స్క్రీన్‌పై కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. డ్యాన్స్‌, ఫైట్‌, కామెడీ, ఎమోషన్‌… ఏ అంశం అయినా చిరంజీవి తన ప్రత్యేక శైలిలో చూపిస్తారు. అందుకే ఆయన ప్రతి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరోవైపు దర్శకుడు బాబీ కూడా కమర్షియల్‌ సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించారు. మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్‌ కూడా కలిపి కథను చెప్పడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. ‘వాల్తేరు వీరయ్య’తో ఈ కాంబినేషన్‌ ఇప్పటికే విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే జోడీ మరోసారి కలిసి పని చేయడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఈ సినిమా మెగాస్టార్‌ అభిమానులకు ఒక భారీ మాస్‌ ఫీస్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కథలో ఉండబోయే ఆ పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *