బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత!

Spread the love

బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధాని, బీఎన్‌పీ (BNP) అధినేత్రి బేగమ్ ఖలీదా జియా (80) మంగళవారం (డిసెంబర్ 30, 2025) ఉదయం కన్నుమూశారు.లివర్ సిర్రోసిస్, గుండె ,కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఖలీదా జియా,సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు.తన రాజకీయ ప్రస్థానంలో మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన ఆమె, షేక్ హసీనాతో సాగించిన సుదీర్ఘ రాజకీయ పోరాటం ఆ దేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఖలీదా జియా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, భారత్-బంగ్లాదేశ్ సంబంధాల బలోపేతానికి ఆమె చేసిన కృషిని కొనియాడారు.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు ఆమెకు నివాళులర్పించారు.ఆమె మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక శకం ముగిసినట్లయింది.