ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లాదేశ్..!

Spread the love

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం ముదిరింది.బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుండి తొలగించాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.తమ దేశపు అగ్రశ్రేణి క్రీడాకారుడి పట్ల బీసీసీఐ వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ, దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలపై బంగ్లాదేశ్ సమాచార శాఖ తక్షణమే నిషేధం విధించింది.ఎటువంటి సహేతుక కారణం లేకుండా ముస్తాఫిజుర్‌ను పక్కన పెట్టడం తమ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ప్రభుత్వం పేర్కొంది.మార్చి 26 నుండి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వులు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.రెండు దేశాల మధ్య దౌత్యపరమైన & క్రీడా సంబంధాలపై ఈ పరిణామం ఎటువంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.