విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్నిభారత క్రికెటర్లు సందర్శించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేడు అప్పన్నను దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక విశాఖ వేదికగా ఈరోజు న్యూజిలాండ్ తో నాలుగో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మూడు టీ 20లను గెలుచుకున్న భారత జట్టు ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇదే ఊపులో నాలుగో టీ 20ని గెలవాలనే ఊపులో ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉండడం బ్యాటింగ్ లో భారత్ కు కలిసొచ్చే అంశం. అటు బౌలింగ్ లో కూడా బుమ్రా, హార్దిక్ పాండ్య వంటి కీలక ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ చివరి రెండు మ్యాచ్ లలోనైనా భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది.