ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా?:వై.ఎస్.జగన్ విమర్శలు

Spread the love

మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా? అని ఏపీ సీఎం చంద్రబాబును మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?  వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి?  అత‌నిపై అక్ర‌మ కేసు పెట్ట‌డం ఏంటి? అత‌ని ఇంట్లో సోదాలు చేయ‌డం ఏంటి? అత‌నేమైనా ఉగ్ర‌వాదా?  టెర్ర‌రిస్టా? మ‌రి మీరు పెడుతున్న పోస్టుల‌కు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? అని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు కేవీఆర్‌పై కూడా త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురిచేయ‌డం జంగిల్ రాజ్ కాదా? ఇంట్లో తాను లేని స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ ఇంట్లో తిష్ట‌వేయ‌డం ఏంటి? ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని మండిపడ్డారు. గ‌డిచిన రెండేళ్ల‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోని మీరు ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మాత్రం వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? అని ప్రశ్నించారు.   మీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నా వాళ్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు?  అని ఆక్షేపించారు. వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా?  పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్ర‌మ కేసులు, అరెస్టుల‌కు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయమని  అని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉందని జగన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *