నిరీక్షణకు తెర..ఈ సీజన్ లో గెలుపు ఖాతా తెరిచిన కోల్ కతా

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో వరుస పరాజయాలతో డీలా పడి విజయం కోసం నిరీక్షిస్తున్న కోల్ కతాకు మొదటి విజయం దక్కింది. తాజాగా ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచి మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవన్షీ 46 (28; 6×4, 2×6), యశస్వీ జైశ్వాల్ 39 (29; 4×4, 2×6) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కోల్ కతా బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తూ రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, కార్తీక్ త్యాగి 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా కూడా మొదట్లో తడబడినప్పటికీ రింకూ సింగ్ 53 నాటౌట్ (34; 5×4, 2×6)  హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అలాగే అనుకూల్ రాయ్ 29 నాటౌట్ (16; 1×4, 2×6) రాణించాడు. వీరిద్దరూ కలిసి కోల్ కతాను విజయతీరాలకు చేర్చారు. కామెరూన్ గ్రీన్ (27), రోవ్ మన్ పావెల్ (23) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు, యష్ రాజ్ పంజా, రవి బిష్ణోయ్, నాన్ద్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *