మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్రమంతా ఆందోళనలో ఉంటే, జగన్ రెడ్డి మాత్రం శవరాజకీయం చేస్తూ సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన నీచ చరిత్ర కలిగిన వ్యక్తి అని అన్నారు. వైఎస్ ఆచూకీ తెలియకముందే పదవి కోసం వెంపర్లాడిన ఈయనకు ప్రజల మీద కక్ష తప్ప ప్రేమ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. సొంత బాబాయి కిరాతకంగా హత్యకు గురైతే గుండె పోటు అంటూ అబద్ధాలు ప్రచారం చేసి, చంద్రబాబుపై ఆరోపణలు చేసిన నీచుడు, కన్నతల్లిని, చెల్లిని రోడ్డున పడేసిన ఈ సైకోకు పదవి మీద తప్ప మరో ధ్యాస లేదని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ మృతి వెనుక జగన్ పాత్ర ఉండొచ్చని ఆనాడు బొత్స అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి, ఇప్పుడు అదే రిలయన్స్ వ్యక్తికి రాజ్యసభ సీటు అమ్ముకున్న జగన్ ఒక పక్కా అవకాశవాదని ఒక సైకో చేతికి అధికారం ఇస్తే రాష్ట్రం ఎలా సర్వనాశనం అవుతుందో ప్రజలు చూశారని అన్నారు. జగన్ రెడ్డి పాలన ప్రజాస్వామ్యానికే ఒక మచ్చని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంపై నీకు పగ ఎందుకు? రాష్ట్ర ప్రజలపై నీకు కక్ష ఎందుకు అని ప్రశ్నించారు.