ఈ సీజన్ లో కోల్ కతా మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ 45 (33; 5×4, 2×6), అజింక్య రహానే 41 (24; 4×4, 2×6), రోవ్ మన్ పావెల్ 39 నాటౌట్ (24; 4×4, 2×6), కామెరూన్ గ్రీన్ 32 నాటౌట్ (24; 3×4, 1×6) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మనిమారన్ సిద్దార్థ్,, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం టార్గెట్ ఛేజింగ్ ఆరంభించిన లక్నో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. మిచెల్ మార్ష్ (15), మార్కరమ్ (22) పరుగులు చేశారు. ఆయుష్ బడోని 54 (34; 7×4, 2×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక కీలక వికెట్లు పడిన తర్వాత ముకేశ్ చౌదరి 54 నాటౌట్ (27; 2×4, 7×6) ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. రన్ రేట్ పెరుగుతూ పోతున్న నేపథ్యంలో అతను కోల్ కతా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ సిక్సర్లతో మ్యాచ్ ను పూర్తిగా లక్నో వైపు తిప్పేశాడు. అద్భుత ఇన్నింగ్స్ తో లక్నోకు విజయాన్ని అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అదిరే ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న ముకుల్ చౌదరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.