నకిలీ మద్యం కేసులో రెండోసారి సిట్ కస్టడీలోకి జోగి బ్రదర్స్!

Spread the love

నకిలీ మద్యం తయారీ , సరఫరా కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), శుక్రవారం (జనవరి 2, 2026) ఉదయం వీరిద్దరినీ మరోసారి మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది.గత విచారణలో లభించిన సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీలపై మరిన్ని స్పష్టమైన వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు వీరిని లోతుగా విచారించనున్నారు.మరోవైపు, నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వీరికి జనవరి 16 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే జోగి రమేష్ అరెస్ట్ సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు.పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై జోగి రమేష్ భార్య & కుమారుడికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.నకిలీ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారులతో వీరికి ఉన్న సంబంధాలు కారణంగా  ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగిన కార్యకలాపాలపై సిట్ అధికారులు ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.