విజయవాడలో పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలక అడుగులు

Spread the love

విజయవాడలో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ మరియు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలక పనులు మొదలయ్యాయి.  విజయవాడ, పెనమలూరు, మరియు గన్నవరం నియోజకవర్గాల్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు జరిగాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో రూ.105 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని సనత్ నగర్‌లో రూ.2.75 కోట్లతో నిర్మించిన కొత్త రోడ్ ను  ప్రారంభించడంతో పాటు, మున్సిపల్ రోడ్ల అభివృద్ధి కోసం రూ.7 కోట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అలాగే ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు మరియు బోడె ప్రసాద్ లు పాల్గొన్నారు. త్వరలోనే తిరుపతి మరియు విజయవాడ నగరాలకు ‘గ్రేటర్’ హోదా కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ జనగణన (సెన్సస్) ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *